ఇది సాధారణమైన కార్యం కాదు. ఒక విశ్వవిద్యాలయంలాంటి కేంద్రంలో కొందరు పరిశోధకులు కలిసి చేయవలసిన పని. ఇటువంటి భారాన్ని సత్యప్రసాద్ అనే ఏకైక వ్యక్తి తన భుజస్కంధాల మీద వేసుకోని, మోసి ఎక్కడా రాజీపడకుండా ప్రజల ముందుకు తీసుకురావడం అనితరసాధ్యం. సినిమా ప్రేమికులే కాదు, మానవజాతి చరిత్ర తెలుసుకోవాలనుకునే వారందరికి ఇదొక అమూల్యమైన కానుక. ` సింగీతం శ్రీనివాసరావు