Welcome To Azad Books

OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹500
Price: ₹160

   దాదాపు ఇరవై రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన మగధ సామ్రాజ్యపు కాలంనాటి చరిత్ర ఇది. ఆనాటి వాడు ఆర్య చాణక్యుడు. సత్యము, ధర్మములే కాక పట్టుదల మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది.

తను రచించిన అర్థశాస్త్ర గ్రంథాన్ని గ్రీకుదేశం తరలించుకుపోదామని భావించిన; జగజ్జేతగా పిలువబడిన గ్రీకు చక్రవర్తి మింగుడు పడని వ్యక్తి. 

తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా మగధ సామ్రాజ్య పరిపాలనావ్యవస్థనే కూకటి వేళ్ళతో  పెళ్ళగించి, ప్రళయం సృష్టించిన మొండి బాపడు ఆర్య చాణుక్యుడు. 

          తన ప్రతిజ్ఞా నిర్వహణకు ముక్కుపచ్చలారని అతి సామాన్య యువకుని ఆయుధంగా స్వీకరించి, మగధ సామ్రాజ్యంలో ఎలా తుఫాను సృష్టించాడు? ఆ యువకునికి, రాజ్యానికి కూడా మహోన్నత భవిష్యత్ ఎలా ప్రసాదించాడు?

           మేధస్సులో తనంతటి వాడైనా మగధ మహామంత్రి రాక్షసుణ్ణి తన కుటిల రాజనీతిజ్ఞతతో ఎలా ముప్పతిప్పలు పెట్టాడో తెలుసుకోవాలంటే.... ఈ చారిత్రక నవల చదవాల్సిందే. 

                                                                                                                 - ప్రసాద్