Welcome To Azad Books

IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹500
Price: ₹130

      అది 1756 వ సంవత్సరం ఏప్రియల్ నెల తొమ్మిదవ రోజు. ఆనాడు బంగాళాదేశపు నవాబు ఆలివర్దిఖాన్ వ్యాధి విపరితమైంది.

                                      ప్రాతః కాలం నుంచి చాలా పర్యాయాలు స్పృహాతప్పుతూ ఉంది. మరల స్పృహాలోకి వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా "వచ్చాడా"? అని ఆదుర్దాగా అడుగు తున్నాడు.

                                       వైద్యులు మౌనం వహిస్తున్నారు. వారి మౌనానికి అర్ధం అతడికి తెలుసు. నిస్పృహతో, నీరసంతో మళ్ళి కన్ను మూయటం - మరో ఘడియ తర్వాత మళ్ళి ప్రశ్న - "వచ్చాడా?" 

                                        "........."

                                        ఆలివర్ధిఖాన్ ఒక సామాన్య సిపాయి. మొగలాయి పాదుషా సేనలో ప్రవేశించిన ఆనతి కాలానికే తన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించి దళవాయి స్థాయిని అందు కున్నాడు. ఆ తరువాత పాదుషా అతడ్ని బెంగాలులో జరుగుతున్న కల్లోలాల నణచటానికి నియోగించాడు. బెంగాలు కల్లోలాల నణచి శాంతిభద్రతులను స్థాపించటానికి వచ్చిన ఆలివర్ధిఖాన్ ను తన కర్తవ్యం నిరవేరిన పిదప తిరిగి ఢిల్లీ వెళ్ళటానికి మనసు రాలేదు.

                                                       -ప్రసాద్.