Welcome To Azad Books

OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹500
Price: ₹100

             అది వసంతం,సూర్యతాపంబను ఆకురాలు రాలి ఎండి మొడులు వారిన తరులు, క్రొగొత్త చిఱువులు సంతరించుకొని వినూత్న శోభలు వెదజల్లుతున్నాయి. దుర్గమ పర్వతారణ్యమయమైన వింధ్యాటమి ప్రాంతం ఉదయభానుని మేలి బంగారం కాంతులతో నేత్రానందంగా గోచరిస్తున్నది. వెన్న చిన్నలు తీర్చిదిద్దుకుని వచ్చిన వసంతని చూచి కఠిన శిలలు సైతం కడకుదనాన్ని కాదు పొమ్మని లావణ్యాన్ని చిందిస్తున్నాయి.

                           "ఓ హుo -ఓ హుo  -ఓ హుo " అంటూ బోయలు బంగారం మీనాను తమ బుజాల పై నుంచుకొని ముందుకు నడుస్తున్నారు. వారి వెనుక సాధ్యములైన సైనికులు పదిమంది అశ్వారూఢులై వస్తున్నారు.

                                                                                                 -ప్రసాద్.